ఐసోలేషన్‌కు దొండపాడు వ్యక్తి తరలింపు

ABN , First Publish Date - 2020-03-30T11:26:49+05:30 IST

ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని అధికారులు జిల్లాలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు

ఐసోలేషన్‌కు దొండపాడు వ్యక్తి తరలింపు

చింతలపాలెం మార్చి29: ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని అధికారులు జిల్లాలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామనికి చెందిన వ్యక్తి ఈ నెల 13వ తేదీన ఢిల్లీలో జరిగిన తబ్లిన్‌-ఇ-జామాట్లో పాల్గొని 17వ తేదీన గ్రామనికి తిరిగి వచ్చాడు. కాగా రెండు రోజులుగా అతడు తీవ్రమైన జ్వరంతో భాధ పడుతుండడంతో వైద్యాఽధికారి ప్రేమ్‌సింగ్‌ ఆదివారం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించామన్నారు.  

Updated Date - 2020-03-30T11:26:49+05:30 IST