పాలిటెక్నిక్‌ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు

ABN , First Publish Date - 2020-02-12T06:16:11+05:30 IST

తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ పాల్‌టెక్నిక్‌ కళాశాలకు అంతర్జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాల గుర్తింపు

పాలిటెక్నిక్‌ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు

తిరుమలగిరి, ఫిబ్రవరి11: తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ పాల్‌టెక్నిక్‌ కళాశాలకు అంతర్జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాల గుర్తింపు (ఐఎస్‌ఓ) సర్టిఫికెట్‌ లభించింది. మంగళవారం హైదరాబాద్‌లోని రూసా భవన్‌లో సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ నుంచి సర్టిఫికెట్‌ను కళాశాల ప్రిన్సిపాల్‌ కె రవీందర్‌ అందుకున్నారు.

కళాశాలలో ఉత్తమ విద్యాబోదన, మౌలిక వసతులకల్పన, విద్యార్థుల ప్రజ్ఞాస్థాయి ప్రతిభ, నాణ్యతా ప్రమాణాలు పాటించినందుకు ఐఎస్‌ఓ 9001-2015కు గుర్తింపుపత్రం అందచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్యాపకులు జి అప్పారావు, జె గంగారెడ్డి, పాష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-12T06:16:11+05:30 IST