అనువైన ప్రాంతంలో ఇండస్ర్టిరియల్‌ పార్క్‌

ABN , First Publish Date - 2020-05-17T10:02:22+05:30 IST

సూర్యాపేట జిల్లాలో అనువైన ప్రాంతంలో ఇండస్ర్టీరియల్‌ పార్క్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

అనువైన ప్రాంతంలో ఇండస్ర్టిరియల్‌ పార్క్‌

మఠంపల్లి, మే 16: సూర్యాపేట జిల్లాలో అనువైన ప్రాంతంలో ఇండస్ర్టీరియల్‌ పార్క్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. పార్క్‌ నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి, వెంకటాయపాలెం, రఘునాథపాలెం గ్రామాల్లోని ప్రభుత్వ భూములను, పరిశ్రమలకు లీజుకు ఇచ్చి ఖాళీగా ఉన్న భూములను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుండ్లపల్లిలోని 170 సర్వే నెంబర్‌ భూమిలో 469 ఎకరాలు, రఘునాథపాలెం శివారులో 258, 247 సర్వే నంబర్లలో 614 ఎకరాలు, 16 నెంబరులో 90 ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.


పెదవీడు, మట్టపల్లి, మఠంపల్లి రెవెన్యూ పరిధిలోని శివారు భూములను మరోమారు పరిశీలిస్తామని తెలిపారు. ప్రసు త్తం పరిశీలించిన భూముల్లో సిమెంట్స్‌ పరిశ్రమలకు చెందిన భూములు లీజులో ఉండి ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని, ఆ పరిశ్రమలు నడపటం లేదని, ఆ భూములను వెనక్కి ఇచ్చేందుకు సంబంధిత పరిశ్రమ యాజమాన్యలు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. భూముల వివరాలను తహసీల్దార్‌ వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట గుండా బ్రహ్మారెడ్డి, వీఆర్వో జితేందర్‌రెడ్డి,చాగంటి వెంకటేశ్వరావు, రవి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-17T10:02:22+05:30 IST