గుర్రపుడెక్కపై సమరం

ABN , First Publish Date - 2020-07-08T10:03:47+05:30 IST

యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి కాల్వలో విస్తరించిన..

గుర్రపుడెక్కపై సమరం

 రైతుల శ్రమదానం

మిషన్లతో ప్రారంభమైన తొలగింపు ప్రకియ

రూ.5 లక్షల విరాళానికి ఎమ్మెల్యే పైళ్ల హామీ

పట్టించుకోని ప్రభుత్వం


భూదాన్‌పోచంపల్లి, జూలై 7: యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి కాల్వలో విస్తరించిన గుర్రపుడెక్క నీటి ప్రవాహానికి అడ్డం కిగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లి, బీబీనగర్‌, వలిగొండ, రామన్నపేట, చిట్యాల మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగు నీరందించే మూసీ కాల్వలో నీటి ప్రవాహం గుర్రపు డెక్క కారణంగా నెమ్మదించింది. ఈ కారణంగా రైతులు ఇబ్బంది పడుతు న్నారు.  గుర్రపు డెక్కను తొలగించాలని రైతులు ప్రభు త్వాన్ని కోరినా స్పందన కరువైంది.


దీంతో రైతులు గుర్ర పుడెక్క తొలగింపునకు ఎకరానికి రూ.300 విరాళంగా వేసుకున్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం దిగువ ఆయకట్టు రైతాంగం కనుముకుల గ్రామం నుం చి విరాళాలు సేకరించి ప్రక్రి యను ప్రారంభించారు. రంగా రెడ్డి జిల్లా నాగోలు సమీపంలోని గౌరెల్లి తూం వద్ద  భారీగా గుర్రపు డెక్క పేరుకుంది. దీనిని తొలగించేందుకు రైతులు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని ఆశ్రయించారు. రూ.5లక్షలు అందజేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాలుగురోజులుగా రైతులు గుర్రపు డెక్కను శ్రమదానంతో తొలగిస్తున్నారు.  

 

రైతులకు ప్రతి ఏటా ఇబ్బందులే

 మూసీకింద ప్రధానంగా భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌, వలిగొండ మండలాల్లో 12 వేల ఎకరాల్లో వరి సా గవుతోంది.  నీటిపారుదల శాఖ పరిధిలో వలిగొండ మం డలంలో 12 చెరువులు, బీబీనగర్‌ మండలంలో ఆరు చెరువులు, భూదాన్‌పోచంపల్లి మండలంలో నాలుగు చెరువులు, 60కి పైగా కుంటలు ఆధారపడి ఉన్నాయి. వీటిలో ప్రతి ఏటా ఏర్పడు తున్న పూడికతో సరిపడా నీరు నిల్వ ఉండక రైతులు ఇబ్బంది పడుతున్నారు. వన రులును  సద్వినియోగం చేసుకుని రైతులకు సరిపడా సాగునీటిని అందించే లక్ష్యం అధికారుల్లో కోరవడింది. గుర్రపుడెక్కతో ఆక్సిజన్‌ అందక చెరువుల్లోని చేపలు మృత్యువాతపడుతున్నాయి. చేపల పెంపకానికి గుర్రపుడెక్క ఆకు ప్రతిబంధకంగా మారింది. 


యాదాద్రిభువనగిరి జిల్లాలో 

జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి కత్వా నుంచి మూసీ వరద నీరు భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌, వలిగొండ మండలాల్లోని చెరువు లకు వెళు తోంది. వలిగొండ మండలం సంగెం వద్ద, ధర్మారెడ్డిపల్లి ఆనకట్ట, పొద్దుటూరు వద్ద భీమలింగం కత్వా, నెమిలికాల్వవద్ద, అసఫ్‌నగర్‌ ఆనకట్టల ద్వారా మూసీనీరు చెరువులకు వెళుతోంది. బీబీనగర్‌ మండలంలో వెంకిర్యాలలో ని పెద్దచెరువు ఆయకట్టు కింద వెయ్యి ఎకరాలు, అదేగ్రామంలోని ఈదులచెరువు కింద 180 ఎకరాలు, చిన్నరావులపల్లిలోని చింతల్‌ చెరువు కింద 120 ఎకరాలు, మక్తా అనంతారంలోని ఎర్రకుంట చెరువుకింద 200 ఎకరా లు, బ్రాహ్మణపల్లిలోని నల్లచెరువు కింద 50 ఎకరాలు, రాఘవాపూర్‌లోని బీబీసాహెబ్‌ చెరువు కింద 388 ఎకరాల సాగవుతోంది.


భూదాన్‌పోచంపల్లి మండలంలో మూసీ పరిధిలో నాలుగు చెరువులు ఉన్నాయి. పోచంపల్లిలోని పెద్దచెరువు కింద 540 ఎకరాలు, గౌసుకొండలోని ఊరచెరువు కింద 192 ఎకరాలు, పెద్దరావులపల్లిలోని పాతసాగర్‌ చెరువు కింద 326 ఎకరాలు, ఇంద్రియాలలోని ఊరచెరువు కింద 720 ఎకరాల వంతున ఆయకట్టు ఉంది. ఈ చెరువుల్లో సగానికిపైగా గుర్రపు డెక్క విస్తరించి ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట, చిట్యాల, చౌటుప్పల్‌ మండలాల్లోని ఆయా చెరువుల్లోనూ గుర్రపుడెక్క ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం స్పందించి  గుర్రపు డెక్క తొలగింపులో సాయం అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.


గుర్రపుడెక్కను తొలగించేలేక ఇబ్బంది పడుతున్నాం:  - చెక్క బస్వరాజ్‌ముదిరాజ్‌, మత్స్యకారుడు, భూదాన్‌పోచంపల్లి 

మూసీ పరివాహక ప్రాంతాల్లోని చెరువుల్లో గుర్రపు డెక్కను  ప్రతీ రెండు నెలలకోసారి తొలగించాల్సి వస్తోంది. మూసీ వరదలో కొట్టుకువస్తున్న గుర్రపుడెక్క ఆకు చెరువు లో పేరుకుపోయి చుట్టూ ఆవరిస్తోంది. చెరువులో ఆక్సిజన్‌ అందక చేపలు చనిపో తున్నందున మాకు తీవ్ర నష్టం వాటిల్లుతోం ది. గుర్రపు డెక్క ఆకు తొలగించే ప్రయత్నంలో మత్స్యకారులు పాము కాటుకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి చెరవుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకును తొలగించాలి. 

Updated Date - 2020-07-08T10:03:47+05:30 IST