తక్కువ ధరకు ఫోన్‌ వస్తుందని ఆశచూపి..

ABN , First Publish Date - 2020-12-30T05:25:42+05:30 IST

తక్కువ ధరకు ఫోన్‌ వస్తుందని ఆశ చూపి ఓ యువతి మోసం చేసింది.

తక్కువ ధరకు ఫోన్‌ వస్తుందని ఆశచూపి..

ఫోన్‌ చేసి మోసం చేసిన యువతి

నార్కట్‌పల్లి, డిసెంబరు 29: తక్కువ ధరకు ఫోన్‌ వస్తుందని ఆశ చూపి ఓ యువతి మోసం చేసింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని నెమ్మాని గ్రామానికి చెందిన బాధితుడు భవురోజు సాయిప్రణీత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని సామ్‌సంగ్‌ మొబైల్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉద్యోగిని మాట్లాడుతున్నానని ఓ యువతి సెల్‌:7411486678 నెంబరు నుంచి ఈనెల 22న ఫోన్‌ చేసింది. ప్రతీ ఏటా కంపెనీనుంచి 50 మందికి రూ.15వేల విలువైన సామ్‌సంగ్‌ జే-7 సిరీస్‌ మొబైల్‌ను రూ.1,500కే ఇస్తున్నామని, మీరు ఎంపికయ్యారని తెలిపింది. పార్శిల్‌ ఇంటికి వచ్చిన తర్వాతే నగదు చెల్లించవచ్చని నమ్మబలికింది. దీంతో  సాయిప్రణీత్‌ ఈనెల  24న మొబైల్‌కు ఆర్డర్‌ చేశాడు. పోస్టల్‌ ద్వారా సాయిప్రణీత్‌ ఇంటికి మంగళవారం పార్శిల్‌ వచ్చింది. దీంతో రూ.1500 చెల్లించి పార్శిల్‌ తీసుకున్నాడు. పార్శిల్‌ విప్పి చూడగా ఫోన్‌కు బదులు రోల్‌గోల్డ్‌ హనుమాన్‌ చైన్‌ ఉంది. మోసపోయానని గ్రహించిన బాధితుడు నార్కట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2020-12-30T05:25:42+05:30 IST