ప్రజల మన్ననలు పొందేలా సేవలు అందించాలి
ABN , First Publish Date - 2020-12-07T05:05:09+05:30 IST
పోలీస్ శాఖలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందేలా సేవలు అందించాలని నల్లగొండ డీఎస్పీ వెం కటేశ్వర్‌రెడ్డి అన్నారు.

నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి
ఘనంగా హోంగార్డుల దినోత్సవం
నల్లగొండ క్రైం, డిసెంబరు 6 : పోలీస్ శాఖలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందేలా సేవలు అందించాలని నల్లగొండ డీఎస్పీ వెం కటేశ్వర్‌రెడ్డి అన్నారు. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హో ంగార్డుల ఆర్‌ఐ భరత్‌భూషణ్ నేతృత్వంలో పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఫ్లాగ్‌మార్చ్‌ను ప్రారంభించి మాట్లాడారు. కానిస్టేబుళ్లతో సమానంగా బందోబస్తు మొదలుకుని స్టేషన్లలో సైతం హోంగార్డులు నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రజలకు, బాధితులకు న్యాయం అందిస్తూ ప్రజల పక్షాన నిలబడి పోలీస్ శాఖ గౌరవాన్ని నిలబెట్టడంతో పాటు మరింత నమ్మకం కలిగించేలా పని చేయాలని సూచించారు. పోలీ స్ శాఖలో హోంగార్డులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని అందుకు అనుగుణంగా క్రమశిక్షణగా పనిచేస్తూ మరింత సమర్థంగా ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లాంటి విభాగాల్లో సైతం సేవలందించే విధంగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. డీపీవో కార్యాలయం నుంచి ప్రారంభమైన ఫ్లాగ్‌మార్చ్ క్లాక్‌టవర్, ప్రకాశంబజార్, భాస్కర్ థియేటర్, వన్‌టౌన్ మీదుగా తిరిగి డీపీ వో వరకూ సాగింది. కార్యక్రమంలో ఎంటీవో స్పర్జన్‌రాజ్, కంపెనీ కమాండర్ ఎండీ.సలీం, భద్రూజ, రఘుతో పాటు హోంగార్డులు పాల్గొన్నారు.
హోంగార్డులకు సన్మానం
పోలీస్ శాఖలో సివిల్ సిబ్బందితో పాటు హోంగార్డుల సేవలు ఎనలేనివని నల్లగొండ రూరల్ ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. హోంగార్డుల దినోత్సవం సందర్భంగా ఆదివారం పోలీ్‌సస్టేషన్‌లో హోంగార్డులను శాలువా, పూలమాలలతో సన్మానించి మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎ్‌సఐలు, సిబ్బంది, హోంగార్డులు వెంకన్న, చిరుమర్తి కిరణ్, సలీం, మాధవి, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.