ఇంటి ‘పన్నులు’ వసూలయ్యేనా?

ABN , First Publish Date - 2020-02-12T06:38:15+05:30 IST

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వా లు అనేక సంక్షేమ పథకాలను తెస్తోంది. క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు.

ఇంటి ‘పన్నులు’ వసూలయ్యేనా?

సూర్యాపేట సిటీ : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వా లు అనేక సంక్షేమ పథకాలను తెస్తోంది. క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు. అధికారుల ఉదాసీనత, నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణాలతో పథకా లు అమలుకు నోచుకోక పల్లెలు అభివృద్ధికి నోచుకోవ డం లేదు. పాలకులు ప్రభుత్వాల గ్రాంట్లకు ఎదురుచూడటం అలవాటు చేసుకుని, గ్రామాలకు ఆదాయం తీసుకొచ్చే ఆర్థిక వనరులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో పన్నుల వసూళ్లు లక్ష్యం చేరుకోవడం విమర్శలు వినిపిస్తున్నాయి. 


కార్యదర్శులు దృష్టి సారిస్తేనే

గ్రామపంచాయతీ కార్యదర్శులు దృష్టి సారిస్తేనే జిల్లాలో వందశాతం ఇంటి పన్నులు వసూలు సాధ్యం అవుతుంది. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పోతే సాధ్యమేనని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 475 గ్రామపంచాయతీలకు ప్రస్తు తం 415 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నా రు. గతంలో రెండు నుంచి మూడు గ్రామపంచాయతీలకు ఒక కార్యదర్శి విధులు నిర్వహించారు. అయితే నూతన పంచాయతీ కార్యదర్శులు నియామకం కావడంతో ప్రతి గ్రామపంచాయతీ ఒక కార్యదర్శి ఉన్నారు. నూతనంగా ఎంపికైనా కార్యదర్శులలో కొంతమంది కార్యదర్శులకు గ్రూప్‌ 2,ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో వారు కార్యదర్శి ఉద్యోగానికి రాజీనా మా చేశారు. అలా 60 చోట్ల వెళ్లిపోవడంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం గ్రామాల ను కొన్ని క్లస్టర్‌గా విభజన చేసి ఇంటి పన్నులను వసూలు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు లేక ఒక కార్యదర్శికి మరో గ్రామపంచాయతీ ఇంటి పన్నులను వసూలు చేసే విధులను అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే పంచాయతీ కార్యదర్శుల కొరత ఇంటి పన్నుల వసూళ్ల పై ఏమాత్రం ప్రభావం చూపదని జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. 


సమీపిస్తున్న గడువు

గ్రామపంచాయతీల్లో ప్రభుత్వం నిర్దేశించిన పన్నుల వసూళ్లు నిర్ణీత గడవు ఈ నెల 28తో ముగుస్తోంది. ఆ నాటికి ఇంటి పన్నులను చెల్లించాలని, కొంతమంది కార్యదర్శులు గ్రామాల చుట్టూ తిరుగుతుండగా, కొంతమంది గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. జిల్లా అధికారులు సహితం మండల, గ్రామ స్థాయి అధికారులపై గడుపులోపు ఖచ్చితంగా పన్నులను వసూలు చేయాలని మండల అధికారులతో పంచాయతీ కార్యదర్శులకు సలహాలను అందిస్తున్నారు.


పన్నుల లక్ష్యం : రూ.10,24,93,906 

జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో వందశాతం ఇంటి పన్నులను వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టకున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పన్నుల వసూళ్లు లక్ష్యాన్ని పూర్తిచేయడానికి కార్యదర్శులపై బాధ్యతలను మోపారు. జిల్లాలో గతంలో 323 గ్రామ పంచాయతీలు ఉండగా, కొత్తగా 152 గ్రామపంచాయతీలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం జిల్లాలో 475 గ్రామ పంచాయతీలున్నాయి. వాటి నుంచి ఈ ఏడాది రూ. 10.24 కోట్లు ఇంటి పన్నుల రూపంలో రావాల్సి ఉంది. ఈ నెల 11 నాటికి రూ.4.90 కోట్లు మాత్రమే వసూలు చేశారు. 48శాతం మాత్రమే వసూలు చేశారు.  

Updated Date - 2020-02-12T06:38:15+05:30 IST