టోల్‌ప్లాజా వద్ద వాహనాల బారులు

ABN , First Publish Date - 2020-12-14T05:29:44+05:30 IST

బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి వాహనాల రద్దీ భారీగా పెరిగింది.

టోల్‌ప్లాజా వద్ద వాహనాల బారులు
టోల్‌ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు

బీబీనగర్‌, డిసెంబరు 13: బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి వాహనాల రద్దీ భారీగా పెరిగింది. సెలవు దినం కావడంతో హైద రాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌ వైపు భారీగా వాహనాల రద్దీ పెరగడంతో టోల్‌ రుసుము వసూళ్లలో జాప్యం జరుగడం వల్ల రెండు కిలో మీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయా ణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


Updated Date - 2020-12-14T05:29:44+05:30 IST