గుండెపోటులో ‘ఆప్‌’ నాయకుడి మృతి

ABN , First Publish Date - 2020-03-25T14:21:05+05:30 IST

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఆమ్‌ఆద్మీపార్టీ జిల్లా నాయకుడు మారేపల్లి శ్రీనివాసరెడ్డి(58) గుండెపోటుకు గురై చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందారు. శ్రీనివా్‌సరెడ్డి తన వ్యవసాయ

గుండెపోటులో ‘ఆప్‌’ నాయకుడి మృతి

మిర్యాలగూడ అర్బన్‌, మార్చి 24: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఆమ్‌ఆద్మీపార్టీ జిల్లా నాయకుడు మారేపల్లి శ్రీనివాసరెడ్డి(58) గుండెపోటుకు గురై చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందారు.  శ్రీనివా్‌సరెడ్డి తన వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న క్రమంలో తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. సోమవారం అతన్ని కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవే టు ఆసుపత్రికి  తరలించగా, వైద్యులు గుండెసమస్య ఉందంటూ ఆపరేషన్‌ పూర్తిచేశారు. చికిత్సపొందుతుండగానే మరోమారు ఆస్వస్థతకుగురై మంగళవారం మృతిచెందినట్లు బందువులు తెలిపారు. శ్రీనివా్‌సరెడ్డి సుధీర్ఘకాలం పాటు సీపీఎంలో కీలక నాయకుడిగా సేవలందించి ఆ తరువాత లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమ్‌ ఆద్మీ పార్టీలో క్రీయాశీలక పాత్రపోషిస్తూ జిల్లాస్థాయి నాయకుడిగా కొనసాగతున్నారు. ఆయన మృతికి ఆప్‌ నాయకులు వినోత్‌, కుతుబుద్దీన్‌ సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్‌రెడ్డి సేవలను కొనియాడారు.

Read more