సరిహద్దులో హెల్త్ చెక్‌పోస్టు వారంరోజులు పొడిగింపు
ABN , First Publish Date - 2020-06-11T09:49:32+05:30 IST
మండలంలోని నల్లబండగూడెం గ్రామపంచాయతీ పరిధిలో రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో

కోదాడ రూరల్, జూన్ 10 : మండలంలోని నల్లబండగూడెం గ్రామపంచాయతీ పరిధిలో రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్త్‌చెక్‌పోస్టును మరో వారంరోజుల పొడిగిస్తున్నట్లు ఆర్డీవో కిషోర్‌కుమార్ తెలిపారు. చెక్‌పోస్టును బుధవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు.కలెక్టర్ ఆదేశానుసారం ఈ నెల 15వరకు చెక్‌పోస్టును కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం ఈ నెల 8న పోలీస్ చెక్‌పోస్టును ఎత్తివేయగా, రెవెన్యూ, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్త్‌చెక్‌పోస్టును కలెక్టర్ ఆదేశాలతో వారం పాటు పొడగిస్తున్నట్లు తెలిపారు.