నూర్పిడి కల్లాలు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-31T04:38:19+05:30 IST

నూర్పిడి కల్లాలు గ్రౌండింగ్‌ చేసిన వాటిని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పీజే.పాటిల్‌ అధికారులను ఆదేశించారు.

నూర్పిడి కల్లాలు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ పాటిల్‌

నల్లగొండ రూరల్‌, డిసెంబరు 30 : నూర్పిడి కల్లాలు గ్రౌండింగ్‌ చేసిన వాటిని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పీజే.పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో  ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, వ్యవసాయ అధికారులతో మండలాలవారీగా పంట నూర్పిడి కల్లాలు, ఉపాధి హామీ పనులు, హరితహారం నర్సరీల నిర్వహణ, వైకుంఠదామంల నిర్మాణం అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంట నూర్పిడి కల్లాలు పూర్తి చేసిన వాటికి చెల్లింపులు చేయాలని, పనుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని, ఇంకా నిర్మాణాలకు ముందుకు రాని వారిని ప్రత్యామ్నాయంగా వేరే వారిని గుర్తించాలన్నారు.  తదుపరి వైకుంఠదామాల నిర్మాణంపై మండలాల వారీగా సమీక్షించారు. పనులు పూర్తిలో  జిల్లా  వెనుకబడి ఉందని, త్వరితిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తి  చేసిన వాటికి పెమెంట్‌ చేయుటకు ప్రతిపాదనలు (బిల్లులు) వెంటనే పంపమని తెలిపారు. తదుపరి సమావేశం వరకు పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2020-12-31T04:38:19+05:30 IST