పచ్చలహారానికి సిద్ధం

ABN , First Publish Date - 2020-06-25T11:04:03+05:30 IST

ఆరో విడత హరితహారం కార్య క్రమం నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.

పచ్చలహారానికి సిద్ధం

నేటినుంచి జిల్లాలో హరితహారం 

83.79 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

సూర్యాపేటలో ప్రారంభించనున్న మంత్రి జగదీష్‌రెడ్డి


సూర్యాపేట(కలెక్టరేట్‌), జూన్‌ 24 : ఆరో విడత హరితహారం కార్య క్రమం నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సమీక్షలతో  అధి కార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏపుగా పెరిగిన మొక్కలను నాటాలని సూచించారు. గతంలో హరితహారంలో నాటిన మొక్కలు ఆశాజనకంగా పెరగకపోవడంతో ఈ సారి అధికారులు మరింత పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. మొక్కల సంరక్షణ పక్కాగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. గ్రా మాల్లోని నర్సరీల్లో పెంచిన మొక్కలను కావాల్సిన ప్రాంతాలకు తరలించి నాటించడానికి వివిధ శాఖల అధికారులు ప్రణాళికలను తయారు చేశారు.. సూర్యాపేట జిల్లాలో  ఆరో విడత హరితహారంలో 83.79లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించారు.


జిల్లావ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వ ర్యంలో 63నర్సరీలను ఏర్పాటు చేసి 32లక్షల మొక్కలను పెంచారు. జిల్లా గ్రామీణాభివృద్థిశాఖ ఆధ్వర్యంలో 475గ్రామపంచాయితీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి వాటిలో 52.48లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అధికారులు సన్న ద్ధమ య్యారు. ఐదోవిడత హరితహారంలో జిల్లాలో కోటి 20లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించగా కోటి 3లక్షల మొక్కలు మాత్రమే నాటారు. 


ప్రతి కుటుంబానికీ ఆరు మొక్కలు

జిల్లాలో అటవీశాఖ ఆధ్యర్యంలో 63 నర్సరీలు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 475నర్సరీలను ఇప్పటికే ఏర్పాటుచేసి మొక్కలు పెంచు తున్నారు. జిల్లాలోని ప్రతి కుటుంబానికీ ఆరు మొక్కలు పంపిణీ చేయా లని అధికారులు భావిస్తున్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈఏడాది కూడా ఆరు పండ్ల మొక్కలను (జామ, నిమ్మ, మునగ, ఉసిరి, సీతాఫలం, అల్లనేరేడు) పంపిణీ చేయనున్నారు.  


గ్రామస్థాయి నుంచి భాగస్వామ్యం

గ్రామస్ధాయి నుంచి జిల్లాస్ధాయి వరకు ఆరో విడత హరితహారం కార్య క్రమాన్ని విజయవంతం చేయడం కోసం గ్రామస్థాయి పంచాయతీ కార్యా లయాల నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాలోని ఉన్నత స్థాయి అధి కారులతో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్ధలు, ఆయా స్వ యం సహాయక సంఘాల సభ్యులు, యువజన సంఘాలు, ప్రజల సహకా రంతో వివిధ ప్ర భుత్వ శాఖల భాగస్వామ్యంతో నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తిచేసేం దుకు నిర్ణయించారు.


ఎక్సైజ్‌శాఖ ఆయా గ్రామపంచాయతీ చెరువుల గట్లపె,ౖ, ఖాళీ స్థలాల్లో ఈత, ఖర్జూర మొక్కలు నాటడం కోసం నర్సర్సీల్లో సిద్థం చేసింది. వ్యవసాయ భూముల్లో, గట్ల పైన టేకు, సుబాబుల్‌, యూకలిప్టస్‌, ఈత, ఖర్జూర, వంటి మొక్కలు నాటనున్నారు. ఖాళీ స్థలాలు, గ్రామీణ రోడ్లు, రహదారులకు ఇరువైపులా వేప, కానుగ, వంటి మొక్కలు నాటేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

Updated Date - 2020-06-25T11:04:03+05:30 IST