కళ్లకు గంతలతో నిరసన

ABN , First Publish Date - 2020-07-19T07:49:15+05:30 IST

తమ సమస్యల పరిష్కారానికి చేనేత కార్మికులు మార్కండేయ ఆలయంలో చేపడుతున్న..

కళ్లకు గంతలతో నిరసన

చండూరు, జూలై 18: తమ సమస్యల పరిష్కారానికి చేనేత కార్మికులు మార్కండేయ ఆలయంలో చేపడుతున్న రిలే దీక్షలు శనివారానికి ఆరో రోజుకు చేరాయి. ఆరో రోజు దీక్షలో చేనేత కార్మికులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. దీక్షకు పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పొట్టబత్తుల సత్యనారాయణ, కర్నాటి యాదగిరి, రాపోలు సతీష్‌, డైరెక్టర్‌ రాపోలు శభరయ్య హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేతల ఆర్థిక బలోపేతానికి నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో పాటు, నెలకు రూ.8వేలు అందించాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ కన్వీనర్‌ జూలూరి ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు తిరందాసు శ్రీనివాసులు, కర్నాటి శేఖర్‌, రావిరాల ఓంకారం, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు నారాయణ, కోమటి వీరేశం, కోకన్వీనర్‌ చిలుకూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-07-19T07:49:15+05:30 IST