హామీలు అమలు చేయాలి : టీడీపీ

ABN , First Publish Date - 2020-12-13T05:39:07+05:30 IST

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మీగడ కొండారెడ్డి, వడ్డెబోయిన శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

హామీలు అమలు చేయాలి : టీడీపీ

మిర్యాలగూడ టౌన్‌, డిసెంబరు 12 : ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మీగడ కొండారెడ్డి, వడ్డెబోయిన శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శనివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించిన పథకాలను అమలు చేయకుండా కొత్త హామీలతో ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. సంవత్సరన్నర కా లంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు జారీ చేయలేదని, వృద్ధ, వికలాంగుల పింఛన్‌ మంజూరు కాలేదన్నారు. నిరుద్యోగ భృతి విషయం కాగితాలకే పరిమితం కాగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా మారిందన్నారు. కొత్తగా ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షలు అందిస్తా మని ప్రభుత్వం ప్రకటించడం ముందున్న ఎన్నికల స్టంటేనని విమర్శించారు. 2014, 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ముక్కెర అంజిబాబు, సోమ నర్సింహగౌడ్‌, అనంతరాములు, మదార్‌, నాగేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T05:39:07+05:30 IST