మాదాపూర్‌లో హమాలీ మృతి

ABN , First Publish Date - 2020-11-27T06:18:46+05:30 IST

తుర్కపల్లి మండలం మాదాపూర్‌ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో హమాలీ కార్మికుడు మృతిచెందాడు.

మాదాపూర్‌లో హమాలీ మృతి


తుర్కపల్లి నవంబరు 26: తుర్కపల్లి మండలం మాదాపూర్‌ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో హమాలీ కార్మికుడు మృతిచెందాడు. మాధాపూర్‌ గ్రామానికి చెందిన జాలిగం ఆంజనేయులు(45) కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో హామాలీ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పొషించుకుంటున్నాడు. అనారోగ్య పరిస్థితుల కారణంగా హమాలీ పని చేయడం మానేశాడు. గురువారమే ఐ కేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కార్మికుడిగా చేరాడు. ఐకేపీ కేంద్రంలో స్పృహత ప్పిపోయి, తుదిశ్వాస విడిచాడు. ఆంజనేయులుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. 


Read more