గురుకుల ప్రవేశాల్లో రాష్ట్రంలోప్రథమ స్థానం
ABN , First Publish Date - 2020-11-21T06:13:13+05:30 IST
విద్యార్థుల ప్రవేశాల్లో నల్లగొండ జిల్లా గురుకులాలు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాయని గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హెచ్.అరుణకుమారి తెలిపారు.

గురుకులాల ఆర్‌సీవో అరుణకుమారి
నల్లగొండ క్రైం, నవంబరు 20: విద్యార్థుల ప్రవేశాల్లో నల్లగొండ జిల్లా గురుకులాలు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాయని గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హెచ్.అరుణకుమారి తెలిపారు. పట్టణంలోని రాంనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ‘విద్యార్థులను కలుద్దాం-జ్ఞాన జ్యోతులు వెలిగిద్దాం’ అనే కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గురుకులాల్లో చదివేందుకు ఎంతో మంది విద్యార్థులు పోటీ పడుతున్నారని, అడ్మిషన్ల కోసం అత్యధిక దరఖాస్తులు వస్తున్నాయన్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి మొత్తం 280 మంది గురుకులాల విద్యార్థులు 10జీపీఏ సాధించారన్నా రు. వివిధ పోటీ పరీక్షలు, కళాశాలల్లో ఉన్నతమైన సీట్లు పొందిన వారి తల్లిదండ్రులను త్వరలో నిర్వహించే ‘ప్రతిజ్ఞ దివ్‌స’లో సన్మానించనున్నట్టు చెప్పారు. సుప్రీం స్వేరో ఆర్.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్ సారధ్యంలో గురుకులాలు ముందంజలో ఉంటున్నాయన్నారు. డీసీవో ఖుర్షీద్ మా ట్లాడుతూ, చదువే అన్నింటికీ మూలమని గుర్తించి పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తిప్పర్తికి చెందిన టీఎ్‌సడబ్య్లూఆర్‌ఎస్ బాలుర గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో స్వేరో ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు రాధ, ప్రిన్సిపాల్ లింగస్వామి, కౌన్సిలర్ బోగరి ఆనంద్, డేవిడ్ స్వేరో తదితరులు పాల్గొన్నారు.