ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2020-05-19T09:53:55+05:30 IST

ఐకేపీ కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సూర్యాపేట

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

అర్వపల్లి, మే 18: ఐకేపీ కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు,  మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మం డలంలోని రామన్నగూడెం పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో 11వేల బస్తాల ధాన్యం ఎగుమతి కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో వజ్జె శ్రీనివాస్‌, అవిలయ్య, వజ్జె వినయ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-05-19T09:53:55+05:30 IST