ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి : రవీంద్ర

ABN , First Publish Date - 2020-12-27T05:49:39+05:30 IST

ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ కోరారు.

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి : రవీంద్ర
లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేస్తున్న రవీంద్రకుమార్‌

దేవరకొండ, డిసెంబరు 26 : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ కోరారు. శనివారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని వడ్త్యతండాకు చెందిన శాంతికి మంజూరైన రూ.20వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ చేసి మాట్లాడారు. దరఖాస్తులు చేసుకున్న వారందరికి సీఎం కేసీఆర్‌ సహాయనిధి మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకుంటున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, ముత్యాల సర్వయ్య, రాజు, కృష్ణ, భీంసింగ్‌, కోట్యానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:49:39+05:30 IST