ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-06-18T11:26:45+05:30 IST

ప్రభుత్వ పథకాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ గుజ్జ దీపికాయుగేంధర్‌రావు అన్నారు.

ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి

సూర్యాపేట (కలెక్టరేట్‌), జూన్‌ 17 : ప్రభుత్వ పథకాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ గుజ్జ దీపికాయుగేంధర్‌రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఎంపీడీవోలతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.


మొక్కలు నాటడమే గాక వాటి సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా లో శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణ పనులను ప్రారంభించి త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో ఎత్తుగా పెరిగిన మొక్కలను మాత్రమే నాటాలని సూచించారు. జిల్లాలో మియావాకీ వనాలకు, మంకీ ఫుడ్‌ కోర్టులకు త్వరలో స్థలాలను గుర్తించాలని సూచించారు.  ఉపాధి హామీ ప థకంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేసి ఉపాధి కూలీలకు వెంటనే డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎల్‌.విజయలక్ష్మి, డిప్యూటి సీఈవో బలరాం, అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-18T11:26:45+05:30 IST