ప్రభుత్వ క్వారంటైన్‌కు భార్యాభర్త
ABN , First Publish Date - 2020-05-29T10:10:52+05:30 IST
కరోనా పాజిటివ్‌తో మద్రాసులో చికిత్స పొంది స్వస్థలానికి వచ్చిన భార్యాభర్తలను అధికారులు

కరోనా పాజిటివ్‌తో మద్రాసులో చికిత్స
శ్రామిక్ రైలులో స్వస్థలానికి క్వారంటైన్‌కు తరలింపు
రామన్నపేట, చింతపల్లి, మే 28: కరోనా పాజిటివ్‌తో మద్రాసులో చికిత్స పొంది స్వస్థలానికి వచ్చిన భార్యాభర్తలను అధికారులు గురువారం ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. యాదా ద్రి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడకు చెందిన ఓ కుటుం బం కొంతకాలంగా మద్రాసులో ఉంటూ కూలి పనులు చేసుకుంటోంది. ఆరుగురు సభ్యులున్న ఈ కుటుంబంలో భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ రాగా మద్రాసులో చికిత్స పొంది రెండు రోజుల క్రితం శ్రామిక్ రైలులో పల్లివాడకు చేరుకున్నారు.
వైద్యపరీక్షలకు సంబంధించిన పత్రాలు చూపకపోవటం, కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో వీరిని అధికారులు ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. చింతపల్లి మండలం వర్కాలకు చెందిన ముగ్గురిని అధికారులు క్వారంటైన్లో ఉంచారు. నాగర్‌కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ వ్యక్తిని వీరు పరామర్శించారు.