ఎంజీయూలో బంగారు పతకాల కోసం చెక్కు అందజేత
ABN , First Publish Date - 2020-02-08T10:49:09+05:30 IST
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటీకల్ కెమిస్ట్రీ కోర్సులో ప్రవీణ్యం సా ధించిన విద్యార్థులకు బంగారు

నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 7: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటీకల్ కెమిస్ట్రీ కోర్సులో ప్రవీణ్యం సా ధించిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసేందుకు ఎన్జీ కళాశాల రిటై ర్డు అధ్యాపకులు అనపురెడ్డి లక్ష్మారెడ్డివిజయలక్ష్మి రూ.1లక్ష చెక్కును ఎంజీయూ ప్రధాన క్యాంప్‌సలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరికి గురువారం అందజేశారు. ప్రతిఏటా జరిగే కాన్వికేషన్‌లో ఆ కోర్సులో అత్యధిక మార్కులు సాధించిన టాపర్లకు గవర్నర్ బంగారు పతకాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి దంపతులను యూనివర్సిటీకి చెందిన ఆ విభాగం అధికారులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ హెచ్‌ఓడీ డాక్టర్ ప్రశాంతి, అధ్యాపకులు రమేష్, రూప, జ్యోతి, శంకరాచారి, రవీందర్, ఆమరేందర్, అభిలాష, తిరుపతి, శ్వేత పాల్గొన్నారు.