గిఫ్ట్‌ ఏ స్మైల్‌ వాహనం ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-24T11:39:19+05:30 IST

కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద అందించిన రెండు అంబులెన్స్‌ వాహనాల్లో ఒకటి చండూరుకు కేటాయించగా దాన్ని జడ్పీటీసీ కర్నా టి వెంకటేశం శుక్రవారం ప్రారంభించారు.

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ వాహనం ప్రారంభం

చండూరు, అక్టోబరు 23 : కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద అందించిన రెండు అంబులెన్స్‌ వాహనాల్లో ఒకటి చండూరుకు కేటాయించగా దాన్ని జడ్పీటీసీ కర్నా టి వెంకటేశం శుక్రవారం ప్రారంభించారు. మంత్రి కేటీఆర్‌ ఆర్బాటాలకు పోకుండా తన జన్మదినం సందర్భంగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందివ్వాలన్న ఉద్దేశంతో గిఫ్ట్‌ ఏ స్మైల్‌కు పిలుపునిచ్చారన్నారు. దానికి స్పందించి రాష్ట్ర వ్యా ప్తంగా పదుల సంఖ్యలో అంబులెన్స్‌ వాహనాలు సమకూరాయన్నారు. దీనికి గాను తెలంగాణ ప్రజలు కేటీఆర్‌కు రుణపడి ఉంటారని తెలిపారు. వీటిని బాగా చూసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, బూతరాజు దశరథ, కౌన్సిలర్‌ కోడి వెంకన్న, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T11:39:19+05:30 IST