జీహెచ్‌ఎంసీ ఫలితాలు టీఆర్‌ఎ్‌సకు చెంపపెట్టు

ABN , First Publish Date - 2020-12-06T04:25:39+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఫలితాలు టీఆర్‌ఎ్‌సకు చెంపపెట్టు అని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు.

జీహెచ్‌ఎంసీ ఫలితాలు టీఆర్‌ఎ్‌సకు చెంపపెట్టు
భువనగిరిలో వాకర్స్‌తో మాట్లాడుతున్న కోదండరాం

రూ.32వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్షా25వేల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్‌దే 

టీజేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం

భువనగిరి టౌన్‌, డిసెంబరు 5: జీహెచ్‌ఎంసీ ఫలితాలు టీఆర్‌ఎ్‌సకు చెంపపెట్టు అని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేయనున్న ఆయన శనివారం భువనగిరిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఆయా రంగాల ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ నాటి నుంచి నేటి వరకు ప్రజలను మోసగించడం, ఊహించని సంపదను వెనుకేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. రూ.32వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రూ.లక్షా 25వేల కోట్ల అంచనాతో రీడిజైన్‌ చేశారని, కేవలం రూ.1600కోట్లతో పూర్తయ్యే మిషన్‌ భగీరథను రూ.35వేలకోట్లతో పూర్తిచేసి భారీగా అవినీతికి పాల్పడి రా ష్ట్రాన్ని రూ.1.40లక్షల కోట్ల అప్పుల్లోకి  నెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ఆదాయం ఘణనీయంగా పడిపోయిన పరిస్థితుల్లో నెలవారీగా రూ.20వేలకోట్ల అప్పు వాయిదాను చెల్లించాల్సిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకున్నదన్నారు. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైన టీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారనే దానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. మార్నింగ్‌ వాకర్స్‌తో పాటు వివిధ సంఘాల ప్రతినిధులతో ఆయన వేర్వేరుగా సమావేశమై మద్దతును కోరారు. ఆయనవెంట టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, రాష్ట్ర కోఆర్డినేటర్‌ సలీం, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు ఉన్నారు. 


సకల జనుల సమ్మెకు జర్నలిస్టులే ప్రేరణ 

తెలంగాణ సాధనలో కీలకమైన సకల జనుల సమ్మెకు భువనగిరి జర్నలిస్టులే ప్రేరణ అని సమ్మె రూపకర్త, ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భువనగిరికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తాను ఏడేళ్ల క్రితం తుంగతుర్తి సమావేశంలో పాల్గొని భువనగిరికి వచ్చినట్లు తెలిపారు. నాడు స్థానిక జర్నలిస్టులతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న సందర్భంలో  తెలంగాణ స్తంభించేలా ఉద్యమం చేపడితేనే లక్ష్యం సాధించగలమని పలువురు జర్నలిస్టు మిత్రులు సూచించారని గుర్తు చేసుకున్నారు.  

Updated Date - 2020-12-06T04:25:39+05:30 IST