ఘనంగా పాలకావడి ఉత్సవం
ABN , First Publish Date - 2020-12-20T05:10:31+05:30 IST
జిల్లాకేంద్రంలోని రామలింగేశ్వర త్రిశక్తిసహిత అయ్యప్పఆంజనేయస్వామి దేవాలయం ఆధ్వ ర్యంలో పాలకావడి మహోత్సవ ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.

సూర్యాపేటటౌన్: జిల్లాకేంద్రంలోని రామలింగేశ్వర త్రిశక్తిసహిత అయ్యప్పఆంజనేయస్వామి దేవాలయం ఆధ్వ ర్యంలో పాలకావడి మహోత్సవ ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధానవీధుల్లో ఉత్సవమూర్తుల శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ బాధ్యులు వాసా కృష్ణ, అర్చ కుడు సతీష్‌శర్మ ఉన్నారు. అదేవిధంగా సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాల యంలో మహాపడిపూజ నిర్వహించారు. స్వామి వారికి భక్తులు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యయాదవ్, గుర్రం సత్యనారాయణరెడ్డి, రాజు, అశోక్‌రెడ్డి, ఆదినారాయణ, ప్రమోద్‌రెడ్డి, భూపతి శ్రీనివాస్, రాజు, కిరణ్, వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా రాజానాయక్ తండాలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా గోదాదేవికి పూజలు నిర్వహించారు.