డ్రిప్ కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-07-19T07:50:05+05:30 IST
మోత్కూరు, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో...

మోత్కూరు, జూలై 18 : మోత్కూరు, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో సూక్ష్మ సేద్యం కోసం రైతులు ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం కింద డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ ఉద్యాన, పట్టు శాఖాధికారి షేక్ నసీమ కోరారు. శనివారం ఆమె విలేకరులతో మా ట్లాడుతూ పండ్ల తోటలు, ఆగ్రోఫారెస్ట్రీ, శ్రీగంధం, మల్బరీ సాగు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు 7997725436నెంబర్ సంప్రదించాలన్నారు.