రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2020-12-04T05:08:22+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన రైతు, వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.

జిల్లావ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు
ధిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతు
కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దహనం
యాదాద్రి, డిసెంబరు 3: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన రైతు, వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా గురువారం ఆందోళనకు దిగాయి. ఆయా పార్టీల నాయకులు పట్టణ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కేంద్రం దిష్టిబొమ్మలను దహనం చేసి, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భువనగిరిలో ప్రజా సంఘాల నాయకులు దాసరి పాండు, దయ్యాల నర్సింహ, వనం రాజు మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న నూతన విధానాలు రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో అన్నంపట్ల కృష్ణ, మాయ కృష్ణ, ఉడుత విష్ణు, సిలివేరు ఎల్లయ్య, పల్లెర్ల అంజయ్య, యాదయ్య పాల్గొన్నారు. చౌటుప్పల్‌లోని జాతీయ రహదారిపై సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ధిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చీరిక సంజీవరెడ్డి, నాయకులు ఎండీ పాషా, ఆత్మకూరు(ఎం)లో కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో వంటిపెంటి గోపాల్‌రెడ్డి, చెర్కు మల్లేశం, రచ్చ గోవర్ధన్, ఆర్.సత్తయ్య, జి.స్వామి, రాంరెడ్డి, కృష్ణారెడ్డి, పుల్లారెడ్డి, వెంకట్‌రెడ్డి, అడ్డగూడూరులో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర అనిల్‌కుమార్, శాంతికుమార్, విజయ్, గురునాథ్, భూదాన్‌పోచంపల్లిలో సీపీఎం మండల కార్యదర్శి పగిల్ల లింగారెడ్డి, గడ్డం వెంకటేష్, కోట రాంచంద్రారెడ్డి, గూడూరు అంజిరెడ్డి, మధు, ఆలేరులో మంగ నర్సింహులు, ఎంఏ ఇక్బాల్, జూకంటి పౌల్, కాసుల నరేష్, ఏఐకేఎంకేఎస్ నేత ప్రసాద్, ఉప్పలయ్య, అంకయ్య, సంస్థాన్‌నారాయణపురంలో దోనూరి నర్సిరెడ్డి, గుంటోజు శ్రీనివాసాచారి, దొంతగోని పెద్దులు, బోడ యాదిరెడ్డి, చింతకాయల నర్సింహ, రాజాపేటలో రాచకొండ జనార్ధన్, చిగుర్ల లింగం, బుగ్గ నర్సింహులు, గజం కృష్ణయ్య, రంగా కనకయ్య, మల్లేశ్, నువ్వుల పోచయ్య, ఆదినారాయణ, రామన్నపేటలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్, కొండమడుగు నర్సింహ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, మాటూరి బాలరాజు, జెల్లెల పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.