పది విద్యార్థులకు అల్పాహారం: శేఖర్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-02-08T10:38:36+05:30 IST
పరీక్షలకు సన్నద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులందరికి అల్పాహారం అందించబోతున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపా రు. శుక్రవారం

బీబీనగర్, ఫిబ్రవరి7 : పరీక్షలకు సన్నద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులందరికి అల్పాహారం అందించబోతున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపా రు. శుక్రవారం ఆయన డీఈవో చైతన్యజైనీతో కలిసి బీబీనగర్ జడ్పీహె చ్‌ఎ్‌సలో సాయంకాల పు అల్పాహారాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 163ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న 6,412మంది పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించేందుకు సాయంత్రం వేళలో స్పెషల్ తరగతులు కొనసాగిస్తున్నారన్నారు. విద్యార్థులు కాలి కడుపుతో ఉండి చదువుకోలేని కారణంగా అల్పాహారం అందించాల ని భావించినట్టు తెలిపారు. అల్పాహారం కొనసాగించేందుకు రూ.5.50లక్షల చెక్కును ఎమ్మెల్యే డీఈవో చైతన్యజైనీకి అందచేశారు. డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులంతా ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఎమ్మెల్యే సొంత డబ్బులు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగల్‌రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీ శ్రీనివాస్, ఎంఈవో నాగవర్దన్‌రెడ్డి, జిల్లా మానిటరింగ్ ఏఎంయు రఘురాంరెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్ వెంకటేష్, హెచ్‌ఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.