వానరాలకు ఫుడ్‌ కోర్టులు: ఎమ్మెల్యే చిరుమర్తి

ABN , First Publish Date - 2020-07-28T10:38:35+05:30 IST

వానరాలకు ఆహార పునరావాస కేంద్రాలుగా మంకీ ఫుడ్‌ కోర్టులు మారనున్నాయని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

వానరాలకు ఫుడ్‌ కోర్టులు: ఎమ్మెల్యే చిరుమర్తి

నార్కట్‌పల్లి, జూలై 27: వానరాలకు ఆహార పునరావాస కేంద్రాలుగా మంకీ ఫుడ్‌ కోర్టులు మారనున్నాయని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్‌పల్లిలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో సుమారు ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న మంకీ ఫుడ్‌ కోర్టులో ఆయన సోమవారం మొక్కలు నాటారు.  కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, సర్పంచ్‌ దూదిమెట్ల స్రవంతి, ఎంపీటీసీ పుల్లెంల ముత్తయ్య, ఉపసర్పంచ్‌ సిర్పంగి స్వామి, ఎంపీడీవో సాంబశివరావు, ఎంపీవో సత్యనారాయణ, వార్డుసభ్యులు, పంచాయతీ కార్యదర్శి సీహెచ్‌.రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-28T10:38:35+05:30 IST