పత్తి జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-16T04:55:28+05:30 IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో పత్తి జిన్నింగ్‌ మిల్లులో షార్ట్‌ సర్క్యూట్‌తో యంత్రాలు దగ్ధమయ్యాయి.

పత్తి జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం
జిన్నింగ్‌ మిల్లులో జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన యంత్రాలు

 సూర్యాపేట డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నాగారం మండలంలో పత్తి జిన్నింగ్‌ మిల్లులో షార్ట్‌ సర్క్యూట్‌తో యంత్రాలు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగారం మండలం ఈటూరు గ్రామపంచాయతీ పరిధి ప్రగతినగర్‌ సమీపంలోని  సిద్ధిఫైవర్‌ పత్తి జిన్నింగ్‌ మిల్లులో మంగళవారం ఉదయం షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. అదే సమయంలో సమీపంలోని నీటి పంపులతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంతలో ఫైరింజన్‌ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే పత్తిని శుద్ధి చేసే యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.45 లక్షల విలువ చేసే యంత్రాలు దగ్ధమయ్యాయి. ఇదిలా ఉంటే సీసీఐ అధికారులు కొనుగోలు చేసి నిల్వ చేసిన పత్తి పంటకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

Updated Date - 2020-12-16T04:55:28+05:30 IST