అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరిక : భాస్కర్‌రావు
ABN , First Publish Date - 2020-12-27T05:40:24+05:30 IST
సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి కార్యకర్తలు టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.

మిర్యాలగూడ, డిసెంబరు 26 : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి కార్యకర్తలు టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లికి చెందిన 50మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఏఎంసీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో శనివారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుండగా వాటికి విశేష ప్రజాదరణ లభిస్తోందన్నారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గువ్వల గు రుస్వామి, సీనియర్ నాయకుడు ఆకిటి రామస్వామితో అనుచరులు ఉన్నా రు. కార్యక్రమంలో మట్టపల్లి సైదులు, ఏఎంసీ డైరెక్టర్ పులి జగదీష్, దుండిగాల శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.