రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : నోముల

ABN , First Publish Date - 2020-05-29T10:16:08+05:30 IST

రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు.

రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : నోముల

నాగార్జునసాగర్‌ / తిరుమలగిరి(సాగర్‌), మే28 : రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు పండించిన పంటను తామే కోనుగోలు చేస్తామని ధైర్యంగా చెప్పేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటలను వేయడం వల్ల  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. అదేవిధంగా తిరుమలగిరి(సాగర్‌) మండ లం ధన్‌సింగ్‌తండాలో ఇటీవల ప్రమాదవశాత్తు వాగులో పడి మృతిచెందిన బాలుడు కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.

Updated Date - 2020-05-29T10:16:08+05:30 IST