ఇంటర్‌ పరీక్షాకేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

ABN , First Publish Date - 2020-03-12T07:00:19+05:30 IST

విద్యార్థులకు అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా

ఇంటర్‌ పరీక్షాకేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

సూర్యాపేట(కలెక్టరేట్‌), మార్చి 11: విద్యార్థులకు అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సాక్షిశ్రీ జూనియర్‌ కళాశాల ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. ఎలాంటి అవకతవకులు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి.


బుధవారం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గణితం-, బాటనీ, సివిక్స్‌ విభాగాల్లో ప రీక్షలు నిర్వహించారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు రాశారు. జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. పరీక్షలకు జనరల్‌, ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి 9398 మంది  విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 8568మంది విద్యార్థులు హాజరు కాగా 830మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అందులో జనరల్‌ విభాగంలో 8396మంది విద్యార్థులకు గానూ 7666 మంది విద్యార్థులు హాజరు కాగా 730 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వోకేషనల్‌ విభాగంలో 1002మంది వి ద్యార్థులకు గానూ 902మంది హాజరు కాగా 100 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.


పరీక్షల సందర్బంగా ఎలాంటి అవకతవకులు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేశారు. పరీక్ష జరిగే సమయంలో జీరాక్స్‌ సెంటర్లు, ఇంటర్‌నెట్‌ కేంద్రాలను బంద్‌ చేయించారు. పరీక్ష సందర్బంగా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను డీఐఈవో జానపాటి కృష్ణయ్య, తనిఖీ చేశారు. 

Updated Date - 2020-03-12T07:00:19+05:30 IST