అంతటా విమోచన దినోత్సవం
ABN , First Publish Date - 2020-09-18T07:03:34+05:30 IST
జిల్లావ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో పలుచోట్ల జాతీయ

(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్)
జిల్లావ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో పలుచోట్ల జాతీయ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా ప లువురు వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం విచారకరమన్నారు. సామాజిక తెలంగాణను ప్రజలు కోరుకుంటే నేడు సీఎం కేసీఆర్ పాలన దొరల పాలనను గుర్తు చేస్తోందన్నారు. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాట యోధులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. అనంతరం సాయుధ పోరాటంలో అమరులైన వారిస్థూపాల వద్ద నివాళి అర్పించారు.