హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2020-07-28T10:36:07+05:30 IST

హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పోచంపల్లి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌ కోరా రు. సోమవారం ఆమె పురపాలక కేంద్రంలోని

హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి

భూదాన్‌పోచంపల్లి / ఆలేరు రూరల్‌ / మోత్కూరు, జూలై 27 : హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పోచంపల్లి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌ కోరా రు. సోమవారం ఆమె పురపాలక కేంద్రంలోని పోచంపల్లి- బీబీనగర్‌ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామి, కమిషనర్‌ బా లశంకర్‌, కౌన్సిలర్లు కొంగరి కృష్ణ, గుండు మధు, కర్నాటి రవీందర్‌, సామల మల్లారెడ్డి, దేవరాయల కుమార్‌, కుడికాల అఖిల బలరాం  పాల్గొన్నారు. ఆలేరు మండలం  కొలనుపాకలో ఎస్‌ఎస్‌ యువసేన స భ్యుడు గుర్రాల బాలకృష్ణ మొక్కలు నాటారు. కార్య క్రమంలో బాల రాజు, సోమన్న, మహేష్‌, రాజు, ప్రవీణ్‌ పాల్గొన్నారు. మోత్కూరు మునిసిపల్‌ సర్వసభ్య సమావేశంలో చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రిమేఘా రెడ్డి మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగంగా నాటిన ప్రతి మొక్క ను పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముని సిపల్‌ కమిషనర్‌ పి.మనోహర్‌రెడ్డి, టీపీవో వీరస్వామి, మేనేజర్‌ శంకర్‌, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-28T10:36:07+05:30 IST