ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-14T05:26:23+05:30 IST

తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నా రు.

ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం
పూజలు చేసి కొండభీమనపల్లి చెరువు నీరు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

 ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

దేవరకొండ, డిసెంబరు 13 : తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నా రు. ఆదివారం ఆయన మండలంలోని కొండభీమనపల్లి చెరువు నీటిని విడుదల చేసి మాట్లాడారు. కొండభీమనపల్లి చెరువు కింద ఉన్న ప్రతీ ఎకరాకు సాగు నీరు అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ చొరవతో తెలంగాణలో బీడు భూములు సాగులోకి వచ్చాయన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా గడువులోగా ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తున్న ఘనత తెలంగాణదేనన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, జడ్పీటీసీ మారుపాకల అరుణసురే్‌షగౌడ్‌, వైస్‌ఎంపీపీ చింతపల్లి సుభాష్‌, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, హనుమంతు వెంకటే్‌షగౌడ్‌, పున్న వెంకటేశ్వర్లు, ఉజ్జిని సాగర్‌రావు, వెంకట్‌రెడ్డి, వెంకటచారి, సైదులు పాల్గొన్నారు. 

గట్టు విజయలక్ష్మి మృతి బాధాకరం 

చందంపేట : గట్టు విజయలక్ష్మి మృతి చాలా బాధాకరమని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన గట్టు విజయలక్ష్మి అనారోగ్యంతో మృతిచెందగా మృతదేహాన్ని ఆదివారం ఎమ్మెల్యే సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట రైతుబంధు పట్టణ అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కేతావత్‌ లక్ష్మానాయక్‌, చిత్రియాల పీఏసీఎస్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, ఎంపీపీ నున్సావత్‌ పార్వతి చందునాయక్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2020-12-14T05:26:23+05:30 IST