నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

ABN , First Publish Date - 2020-08-01T11:25:09+05:30 IST

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ అన్నారు.

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

చింతపల్లి, జూలై 31 : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ అన్నారు. జిల్లాలోని చింతపల్లి, గుర్రంపోడు మం డలాల్లో  శుక్రవారం ఆయన పర్యటించారు. గొడుకొండ్ల నుంచి తీదేడు వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను, కుర్మపల్లి గ్రామంలో శ్మశానవాటికను, తీదేడులో రైతువేదిక నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రకృతివనాన్ని ఏర్పా టు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అదేవిధంగా గుర్రంపోడు మండలం కాలువపల్లిలో వైకుంఠధామాన్ని ప్రారంభించారు. డంపింగ్‌యార్డు, కం పోస్టుయార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ ఎర్రబెల్లి శేఖర్‌రెడ్డి, ఎంపీపీ కొండూరు భవానీపవన్‌కుమార్‌, జడ్పీటీసీలు కంకనాల ప్రవీణ, గాలిసరిత, సర్పంచ్‌ కౌలస్య, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-01T11:25:09+05:30 IST