ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం : వెంకన్నగౌడ్‌

ABN , First Publish Date - 2020-12-07T05:06:30+05:30 IST

ఉద్యోగుల సమస్యలపై సంఘం రాజీలేని పోరాటం చేస్తుందని విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకు వెంకన్నగౌడ్‌ అన్నారు.

ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం : వెంకన్నగౌడ్‌
నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీని అభినందిస్తున్న నాయకులు

నల్లగొండ టౌన్‌, డిసెంబరు 6 : ఉద్యోగుల సమస్యలపై  సంఘం రాజీలేని పోరాటం చేస్తుందని విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకు వెంకన్నగౌడ్‌ అన్నారు. స్థానిక విద్యుత్‌ విశ్రాంతి భవన్‌లో ఆదివారం నిర్వహించిన సంఘం జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాజమాన్యంతో ఎప్పటికప్పుడు చర్చించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. బీసీ ఉద్యోగులకు సీఎండీ, డైరెక్టర్‌, ఇంజనీర్‌ పోస్టుల్లో స్థానం కల్పించాలన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మారం శ్రీనివాస్‌, కార్యదర్శిగా ఊ ట్కూరి గిరి, జోనల్‌ కార్యదర్శిగా జంజిరాల వెంకన్న, గౌరవ అధ్యక్షుడిగా డీఈ విద్యాసాగర్‌ను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు మారం శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కంపెనీ అధ్యక్షుడు పి.యాదగిరిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీజే.వేణుగోపాల్‌, డీఈ టీఆర్‌ఈ వనం శ్రీనివాస్‌, దామోదర్‌, రాజశేఖర్‌, రాంమ్మూర్తి, పాండు నరేందర్‌రావు, గంగాధర్‌, రాంమ్మూర్తి, మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T05:06:30+05:30 IST