దేవాలయాల అభివృద్ధికి కృషి : రవీంద్ర
ABN , First Publish Date - 2020-12-28T05:56:45+05:30 IST
నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు.

చందంపేట, డిసెంబరు 27 : నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని కంభాలపల్లి గ్రామంలో మహాలక్ష్మమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దైవచింతనతోనే మా నసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్‌రెడ్డి, చందంపేట, నేరేడుగొమ్ము జడ్పీటీసీ లు రమావత్ పవిత్రబాయి, కేతావత్ బాలూనాయక్, శిరందాసు కృష్ణ య్య, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మల్లారెడ్డి పాల్గొన్నారు.