తక్షణమే విద్యాసంస్థలు ప్రారంభించాలి : ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2020-12-29T05:51:16+05:30 IST

తక్షణమే విద్యాసంస్థలు ప్రారంభించాలని ఎమ్మె ల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.

తక్షణమే విద్యాసంస్థలు ప్రారంభించాలి : ఎమ్మెల్సీ
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

హాలియా, డిసెంబరు 28 : తక్షణమే విద్యాసంస్థలు ప్రారంభించాలని ఎమ్మె ల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన హాలియాలో ఎస్‌ఎఫ్‌ ఐ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు విద్యాసంస్థలను ప్రారంభించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆన్‌లైన్‌ అందరికీ అందనందున వెంటనే పాఠశాలలు ప్రారంభి ంచాలన్నారు. డిసెంబరు 29, 30, 31వ తేదీల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామగ్రామాన నిర్వహించాలని కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశ్వర్లు, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకుడు కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కొండేటి శ్రీను, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖమ్మంపాటి శంకర్‌, మల్లం మహేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు అకారపు నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:51:16+05:30 IST