ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-17T05:56:38+05:30 IST

ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది

ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య


చిట్యాల రూరల్‌, డిసెంబరు 16: ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చిట్యాల ఎస్‌ఐ రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన కల్లూరి జంగయ్య కుటుంబం కూలీపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రాగా జంగయ్య భార్య లావణ్య(30) మనస్తాపం చెంది, ఇంట్లో అందరూ నిద్రించే సమయంలో ఉరేసుకుంది. భర్త నిద్రనుంచి మేల్కొని చూడగా  లావణ్య మృతిచెంది ఉంది. లావణ్యకు ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లావణ్య సోదరుడు మహేష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


Updated Date - 2020-12-17T05:56:38+05:30 IST