అన్నపూర్ణాదేవిగా దుర్గాదేవి

ABN , First Publish Date - 2020-10-21T06:42:44+05:30 IST

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం దుర్గాదేవిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు

అన్నపూర్ణాదేవిగా దుర్గాదేవి

సూర్యాపేటటౌన్‌ / హుజూర్‌నగర్‌ /హుజూర్‌నగర్‌ రూరల్‌ /  మేళ్లచెర్వు / నేరేడుచర్ల, అక్టోబరు 20 : దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం దుర్గాదేవిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా కుంకుమార్చన, చండీహోమం, రుద్రహోమం పూజలు నిర్వహించారు. అమ్మవారికి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని సంతోషిమాత, కనకదుర్గమ్మ, వేంకటేశ్వరస్వామి, విశ్వనాథస్వామి ఆలయాల్లో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌ కనకదుర్గమ్మ ఆలయం వద్ద పూజలు చేసి, అన్నదానం చేశారు. హుజూర్‌నగర్‌, బూరుగడ్డ గ్రామాల్లో కనకదుర్గ, మేళ్లచెర్వులో  వనదుర్గ, శంభులింగేశ్వరస్వామి ఆలయాల్లో, నేరేడుచర్లలో విజయదుర్గా ఆలయంలో మహిళలు పూజలు చేసి మొక్కులు చెల్లించారు. 

Updated Date - 2020-10-21T06:42:44+05:30 IST