డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-15T06:01:12+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ రాహల్‌శర్మ అన్నారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ

మిర్యాలగూడ, డిసెంబరు 14: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ రాహల్‌శర్మ అన్నారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఆర్డీఓ రోహిత్‌సింగ్‌తో కలిసి ఆర్డీవో కార్యాలయంలో విద్యుత్‌, మునిసిపల్‌ రోడ్డు భవనాల శాఖ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణ పరిధిలో చేపట్టిన 560 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికి అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, అండర్‌గ్రౌండ్‌ డైనేజీ పనులు వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తిచే యాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. అన్ని ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి సరఫరాను పరీక్షించాలన్నారు. కార్యక్రమంలో హౌజింగ్‌ పిడి రాజ్‌కుమార్‌, మున్సిఫల్‌ కమీషనర్‌ చీమ వెంకన్న, ఆర్‌అండ్‌బి డీఈ గణేష్‌కుమార్‌, విద్యుత్‌శాఖ డీఈ వెంకట కిష్టయ్య, డిఏఓ హజీ, ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-15T06:01:12+05:30 IST