నిబంధనలను పాటించి వాహనాలు నడపాలి :సీఐ

ABN , First Publish Date - 2020-12-04T05:06:10+05:30 IST

ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించి వాహనాలు నడపాలని హుజూర్‌నగర్‌ సీఐ రాఘవరావు సూచించారు.

నిబంధనలను పాటించి వాహనాలు నడపాలి :సీఐ
అవగాహన కల్పిస్తున్న సీఐ రాఘవరావు

మఠంపల్లి, డిసెంబరు 3: ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించి వాహనాలు నడపాలని హుజూర్‌నగర్‌ సీఐ రాఘవరావు  సూచించారు.మండలకేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో గురువారం జరిగిన ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రైవర్లు తప్పనిసరిగా లైస్సెన్‌ కలిగి ఉండాలని, వాహనాలకు ఆర్‌సీ, బీమా ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మన్నెం శ్రీనివా్‌సరెడ్డి, ఇంచార్జి ఎస్‌ఐ సుందరయ్య, ఆటో యూనియన్‌ నాయకులు రాజు, సైదులు, రాంబాబు, గోపి, సురేష్‌, సకృనాయక్‌, నరేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T05:06:10+05:30 IST