డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2020-05-30T09:27:38+05:30 IST

దేవుడు కరుణించినా పూజారి వరమివ్వని పరిస్థితిలా ఉంది ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశుల స్వామి పరిస్థితి.

డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయాలి

అంశుల స్వామి విషయంలో మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు బేఖాతర్‌


నల్లగొండ టౌన్‌, మే 29 : దేవుడు కరుణించినా పూజారి వరమివ్వని పరిస్థితిలా ఉంది ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశుల స్వామి పరిస్థితి. గతేడాది జూలై నెలలో అంశుల స్వామి మంత్రి కేటీఆర్‌ను కలిసి తన బాధను వెళ్లబోసుకున్నాడు. దీనికి స్పందించిన మంత్రి వెంటనే అంశుల స్వామికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరుకు అధికారులకు ఆదేశాలు జారీ చే శారు. ప్రత్యేక కోటా కింద మునుగోడు నియోజకవర్గం నుంచి కేటాయించాలని అప్పటి కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌కు లేఖ రాశారు.


మంత్రి ఆదేశించి 10నెలలుగా ఆ లేఖకు ఎలాంటి మోక్షం లేదు. ఈ కాలంలో స్వామి అనేకమార్లు కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ సైతం ఇటీవల బదిలీపై వెళ్లారు. కొత్తగా వచ్చిన కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను సైతం గతంలో కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. అయినా స్పందన లేకపోవడంతో తిరిగి మరోసారి శుక్రవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కలెక్టర్‌ స్పందిస్తూ త్వరలో ఇల్లు మంజూరుకు చర్య తీసుకుంటామని తెలపడంతో తిరిగి వెళ్లిపోయాడు.

Updated Date - 2020-05-30T09:27:38+05:30 IST