మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించవద్దు : జడ్పీ సీఈవో

ABN , First Publish Date - 2020-03-12T07:05:52+05:30 IST

ప్రతి గ్రామంలో మొక్కలు పెంచడంలో నిర్లక్ష్యం వహించవద్దని జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన

మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించవద్దు : జడ్పీ సీఈవో

బొమ్మలరామారం, మార్చి11 : ప్రతి గ్రామంలో మొక్కలు పెంచడంలో నిర్లక్ష్యం వహించవద్దని జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండ ల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంతో పాటు నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 50లక్షల మొక్క లు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దానిలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రామాలను సందర్శించి నర్సరీల్లో మొక్కల వివరాలను తెలుసుకుంటున్నామని తెలిపారు.


ఇప్పటి వరకు మండలవ్యాప్తంగా 33నర్సరీలను ఏర్పాటు చేయగా ఈ ఏడాది 4.35లక్షల  మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో గ్రీన్‌ప్లాంట్స్‌లో భాగంగా ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పెంచేలా అవగాహన కల్పిస్తున్నామని ప్రతి పంచాయతీ పాలకవర్గంతో పాటు మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మొక్క ల సంరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల్లో నాటిన మొక్కల్లో కనీసం 85శాతం కచ్చితంగా కాపాడాలన్నారు. రైతులకు ఇచ్చిన మొక్కలను  వ్యవసాయ క్షేత్రాల్లో నాటి కాపాడుకునేందుకు నెలకు మొక్కకు రూ.5చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు.


ఈ వేసవిలో మొక్కలు కాపాడేందుకు పంచాయతీ పాలకవర్గం ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని సూచించారు. అనంతరం నర్సరీలతో పాటు ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఇప్పటి వరకు డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషాద్రినాయుడు, ఎంపీఓ గీతారెడ్డి, ఈజీఎస్‌ ఏపీఓ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-12T07:05:52+05:30 IST