విధుల్లో అలసత్వం వహించొద్దు: ఏసీ

ABN , First Publish Date - 2020-10-01T10:07:20+05:30 IST

విధుల్లో అలసత్వం వహించొద్దని అదనవు కలెక్టర్‌ పద్మజారాణి అన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం సందర్శించి, రికార్డులను

విధుల్లో అలసత్వం వహించొద్దు: ఏసీ

పెన్‌పహాడ్‌, సెప్టెంబరు 30 : విధుల్లో అలసత్వం వహించొద్దని అదనవు కలెక్టర్‌ పద్మజారాణి అన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం సందర్శించి, రికార్డులను పరిశీలించారు. అనంతరం మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని ఎంపీడీవో వేణుమాధవ్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తయ్యేలా దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో ఆంజనేయులు, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T10:07:20+05:30 IST