క్రీడాకారులకు మెరుగైన వైద్య సేవలకు కృషి
ABN , First Publish Date - 2020-11-26T06:19:19+05:30 IST
క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ వైద్యశాఖతో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామని డీఎంహెచ్‌వో అన్నిమళ్ల కొండల్‌రావు అన్నారు.

డీఎంహెచ్‌వో అన్నిమళ్ల కొండల్‌రావు
నల్లగొండ క్రైం, నవంబరు 25 : క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ వైద్యశాఖతో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామని డీఎంహెచ్‌వో అన్నిమళ్ల కొండల్‌రావు అన్నారు. ట్రూ టీచర్స్ కొయెలేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న విజడమ్ లీగ్ 2020 పోస్టర్‌ను బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. అన్ని స్థాయిల్లో నిర్వహించే క్రీడా పోటీలకు తమ శాఖ నుంచి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. క్రీడల జిల్లా కోఆర్డినేటర్ డేవిడ్ స్వేరో మాట్లాడుతూ క్రీడాకారులు ఈ నెల 29వ తేదీ ఉదయం 8గంటల వరకు ఎన్జీ కళాశాల మైదానంలో హాజరు కావాలని సూచించారు. కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కో ఆర్డినేటర్ లింగస్వామి, మీసాల వెంకన్న, శంభులింగం పాల్గొన్నారు.