లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు : డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2020-11-26T05:50:46+05:30 IST

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో హర్షవర్థన్‌ హెచ్చరించారు. తి రుమలగిరిలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బుధవారం తనిఖీలు ని ర్వహించారు.

లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు : డీఎంహెచ్‌వో
తిరుమలగిరిలో హాస్పిటల్‌ పత్రాలు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

తిరుమలగిరి, నవంబరు 25: లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో హర్షవర్థన్‌ హెచ్చరించారు. తి రుమలగిరిలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బుధవారం తనిఖీలు ని ర్వహించారు. వెన్నెల ఆస్పత్రిలో అనుమతి లేకుండా స్కానింగ్‌ తీస్తున్న ట్లు తమ దృష్టికి వచ్చిందని, గతంలో మూడుసార్లు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకపోవడంతో తనిఖీ చేశామన్నారు. విచారణ చేసి నివేదికను కలెక్టర్‌కు ఇవ్వనున్నట్లు తెలిపారు. తనిఖీ సమయం లో ఆస్పత్రిలో  సరైన సౌకర్యాలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చే శారు. అన్ని సౌకర్యాలు కల్పించకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, వైద్యం చేస్తే క్లినిక్‌ లను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డెమో మధుసూ దన్‌రెడ్డి, సీసీ భాస్కర్‌రాజు, సైదులు, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2020-11-26T05:50:46+05:30 IST