దైవ చింతన, ధ్యానంతో ఏకాగ్రత

ABN , First Publish Date - 2020-12-11T06:25:47+05:30 IST

దైవ చింతన, ధ్యానంతో ఏకాగ్రత లభిస్తుందని వేదపండితులు పీసపాటి లక్ష్మీగణపతిశాస్ర్తి అన్నారు.

దైవ చింతన, ధ్యానంతో ఏకాగ్రత

మిర్యాలగూడ టౌన్‌, డిసెంబరు 10 : దైవ చింతన, ధ్యానంతో ఏకాగ్రత లభిస్తుందని వేదపండితులు పీసపాటి లక్ష్మీగణపతిశాస్ర్తి అన్నారు. పట్టణంలోని శ్రీసాయి దత్తాశ్రమంలో నిర్మించిన ధ్యాన మందిరాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిలో విద్య, ఉద్యోగం, వ్యాపార, వాణిజ్యాల్లో పోటీ అధికంగా ఉందని, తద్వారా భక్తులు ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. ఒత్తిడిని అఽఽధిగమించడంతో పాటు మానసిక ప్రశాంతత పొందేందుకు ధ్యానం దోహదపడుతుందన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆశ్రమ పీఠాధిపతి కాకాని ఈశ్వరమ్మ విగ్రహానికి ఊరేగింపు నిర్వహించి ఆలయంలో ప్రతిష్టించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుండా శ్రీనివాస్‌, నరేందర్‌, జగన్నాధరావు, ప్రతాప్‌, అంజిబాబు, పద్మ, సత్యవతి, చంద్రకళ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T06:25:47+05:30 IST