తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కాల్యతండా వాసికి చోటు

ABN , First Publish Date - 2020-02-08T10:56:30+05:30 IST

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో మండలంలోని కాల్యతండాకు చెందిన రమావత్‌ రమే్‌షకు చోటు దక్కింది. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని సిద్ధ్దార్థ ఇంజనీరింగ్‌

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కాల్యతండా వాసికి చోటు

డిండి, ఫిబ్రవరి 7: తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో మండలంలోని కాల్యతండాకు చెందిన రమావత్‌ రమే్‌షకు చోటు దక్కింది. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని సిద్ధ్దార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో లైఫ్‌ ఆఫ్టర్‌ ఆయిల్‌ ఇటాలియన్‌ సంస్థ నిర్వహించిన మెమోరి పోటీల్లో మూడు నిమిషాల సమయంలో వంద అంకెలను గుర్తుంచుకొని చెప్పడంతో రమే్‌షకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. కొత్త జాతీయ స్థాయి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న రమే్‌షను తండావాసులు అభినందించారు. ఇటలీకి చెందిన ఫిలినియన్‌ ప్లోరిడి చేతులమీదుగా అవార్డును రమేష్‌ అందుకున్నారు.

Updated Date - 2020-02-08T10:56:30+05:30 IST